STAY AWAY FROM THESE PEOPLE
మీరు ఆఫీసులో ప్రశాంతంగా లేరా? - దానంతటికీ కారణం వాళ్లేనట! - దూరంగా ఉంటే బెటర్ అంటున్న నిపుణులు! - STAY AWAY FROM THESE PEOPLE
- మీ ప్రశాంతతను కాపాడుకోవడానికి ఈ లక్షణాలు ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండాలని సూచన!
People_Avoid_in_Your_Life
People_Avoid_in_Your_Life (ETV Bharat)
author img
By ETV Bharat Lifestyle Team
Published : April 18, 2025 at 5:26 PM IST
2 Min Read
AVOID THESE PEOPLE FROM YOUR LIFE : జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులైన ఎదుర్కొనే పరిణతి ఉండాలి. కానీ కొంతమంది వ్యక్తులు చేసే పనులు వల్ల మనశాంతి కరవుతుంది. ముఖ్యంగా ఆఫీసుల్లో ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కొంతమంది చేసే పనులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మరికొన్ని సందర్భంలో తీవ్ర మానసిక క్షోభకు గురిచేయవచ్చు. మరి ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి? జీవితంలో, ముఖ్యంగా ఆఫీసుల్లో మనం ఎలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎప్పుడూ ఫిర్యాదులు చేయడం : ఇలాంటి వ్యక్తులు ఎప్పుడూ ఎదుటి వారి తప్పులు వెతుక్కునే ధోరణిని కలిగి ఉంటారు. తమ జీవితంలో ఏం జరుగుతుందో విషయాన్ని మర్చిపోయి ఇతరులు చేసే ఏ పనిని అయినా నిశితంగా గమనిస్తూ తప్పులను ఎత్తి చూపుతూ ఉంటారు. మీ పనిని సమర్థంగా నిర్వహించినా, అందుకు వారు అభినందించకపోగా ప్రతికూల వ్యాఖ్యలు చేస్తారు. దీంతో పాటు మిమ్మల్ని తక్కువ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. కాబట్టి, ఈ లక్షణం ఉన్న వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మీరు చేసే పనిని, మీ నిర్ణయాలను ఎల్లప్పుడూ విమర్శించే వ్యక్తులతో సన్నితంగా ఉండటం వల్ల మీరు మానసిక ఒత్తిడికి గురవుతారని చెబుతున్నారు.
అహంకారపూరిత వ్యక్తులు : వారు తమను తాము ఇతరుల కన్నా ప్రత్యేకమైన వారిగా, సమర్థులుగా భావిస్తారు. ముఖ్యంగా ఆఫీసులో ఈ గుణం ఉన్నవారు చాలా మంది ఉంటారు. వారు ఇతరుల భావాలు, అభిప్రాయాలను అర్థం చేసుకోరు కదా అసలు గౌరవించారు. ఇలాంటి వ్యక్తిత్వం గలవారు ఇతరులను విమర్శిస్తారు, కానీ వారు ఇతరుల విమర్శలను అంగీకరించరు. ఇతరుల పనిని అదే పనిగా విమర్శించే వారికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
నకిలీ వ్యక్తులు : ఇలాంటి వ్యక్తులు అందరి మంచిని కోరుకుంటున్నట్లుగా ప్రవర్తిస్తారు. కానీ వారు నిజంగా అలాంటి మనస్తాత్వం గలవారు కాదు. ఇతరులతో స్నేహపూర్వకంగా ఉన్నట్లు నటిస్తారు. అయితే, ఇలాంటి వ్యక్తులు తమ జీవన నాణ్యతను మెరుగుపరచుకోవడానికి ఇతరులకు అసలు సలహా ఇవ్వరు. వీరు ప్రతికూల విషయాలు చెప్పడం ద్వారా ఇతరులు అనవసరమైన ఆలోచనలతో వాళ్లు జీవితాన్ని దుర్భరం చేసుకునేలా ప్రొత్సహిస్తారు. ఇలాంటి వారి వల్ల మనశాంతి, ఆనందాన్ని నాశనం అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
గాసిప్ చేసేవారు : పనిలో మీ గురించి గాసిప్ చేసే వ్యక్తులకు దూరంగా ఉండమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వారు మీరు ఏం చేసినా పెద్ద విషయంగా చూస్తుంటారు. ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి మీకు వ్యతిరేకంగా మాట్లాడతారు. ఈ రకమైన వ్యక్తిత్వం ఉన్న వారు మీతో నిజాయితీగా వ్యవహరించరు. మీరు ఎప్పుడూ తప్పు చేస్తారా అని వేచి చూస్తారు. ఆ తర్వాత దాని గురించి ఇతరులకు చెప్పి వారి దృష్టిలో మిమ్మల్ని చెడుగా చూపించేందుకు ప్రయత్నిస్తారు. అలాంటి వారిని పట్టించుకోవద్దని అంటున్నారు.
సత్యాన్ని వక్రీకరించేవారు : ఎవరైనా చెప్పే విషయాన్ని ఇతరులకు చెప్పినప్పుడు అందులో ఉన్న విషయాన్ని మార్చే చెప్పే ధోరణి కొంత మందికి ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు మీపై అబద్ధాలు చెప్పి ఇతరుల్లో గందరగోళాన్ని కలిగించడానికి వెనుకాడరు. ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Post a Comment