HOW TO HANDLE CHILDREN IN SUMMER

 

సమ్మర్​లో పిల్లలు సమయానికి తినట్లేదా? - అలా అనకండి, ఇలా చెప్పండి - ప్లేట్లు ఖాళీ చేస్తారు! - HOW TO HANDLE CHILDREN IN SUMMER

- సెలవుల్లో పిల్లలను ఎలా డీల్ చేయాలో చెబుతున్న నిపుణులు

Mother_Tips_Manage_Children
Mother_Tips_Manage_Children 
3 Min Read

Mother Tips Manage Children in Summer : పిల్లలకు సమ్మర్ హాలిడేస్ వచ్చేశాయి. పుస్తకాలకు బై చెప్పి, స్నేహితులతో కలిసి ఆటపాటల్లో మునిగిపోతారు. ఎంతగా అంటే వాళ్లుకు దాహం వేయదు. అసలు అన్నం తినాలన్న ఆలోచనే రాదు. అయితే, ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలను ఎలా డీల్ చేయాలనే విషయంలో నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

గట్టిగా అరవకూడదు : పిల్లల ప్రవర్తన ఇక అమ్మలకు తలనొప్పి మొదలవుతుంది. స్కూల్ లేదనే సాకుతో సమయానికి లేవరు, చెప్పిన పనిచేయరు, టైంకి అన్నం తినరు. ఇవన్నీ అమ్మల ఓపికకు పరీక్ష పెడతాయి. పిల్లలకు పదే పదే చెప్పినా వినకపోతే అరవడం, దండించడం లాంటివి చేస్తుంటారు. ఈ పద్ధతి మంచిది కాదంటున్నారు నిపుణులు. ఇలా చేస్తే మరింత మొండిగా తయారవుతారని హెచ్చరిస్తున్నారు.

రూల్స్ పెట్టండి : పిల్లలకు క్రమశిక్షణ నేర్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అయితే అది వాళ్లల్లో భయం, అవమానం కలిగించేలా ఉండకూడదని నిపుణులు చెబుతున్నారు. సానుకూలత నింపేలా మీపై గౌరవం, నమ్మకం పెంచేలా ఉండాలంటారు. అప్పుడే పిల్లల్లో సానుకూల ధోరణి, సహానుభూతి వంటివి ఏర్పడతాయని పేర్కొన్నారు. "ఇవాళ కాసేపు ఆడుకోవచ్చుగా" అని చెప్పి, మరుసటి రోజు "ఎంతసేపూ ఆటలేనా?" అంటూ రోజుకో తీరుగా మాట్లాడితే పిల్లలకు తికమకగా ఉంటుందని చెబుతున్నారు. ఇలా కాకుండా ఫలానా టైంకి లేవాలి. టిఫిన్, లంచ్ ఫలానా టైమ్​ లోపు పూర్తి కావాలి. ఏ టైంలో, ఎంత సేపు ఆడుకోవాలి అనే విషయాలను కచ్చితంగా చెబితే వాళ్లకీ సృష్టత వస్తుందని చెబుతున్నారు. ఈ నియమాలనే వారు అనుసరిస్తారని చెబుతున్నారు నిపుణులు.

ప్రోత్సహించాలి : పిల్లలు ఏదైనా తప్పు చేస్తే కొెందరు పేరెంట్స్ వెనకాముందు చూడకుండా తిట్టేస్తారు. అదే మంచి పని చేస్తే మాత్రం చూసీ చూడనట్లు ఉండిపోతారు. ఇలాంటి పద్ధతిని తల్లిదండ్రులు మార్చుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు. మంచి పనులు చేస్తే పిల్లలను ప్రోత్సాహించాలని, అందుకే వాళ్లకు చిన్న బహుమతి, ముద్దు, హగ్ లాంటివి ఇవ్వాలని సూచిస్తున్నారు. అప్పుడే పిల్లలు మంచి పనులను ఆనందంగా కొనసాగిస్తారు.

అసహనం పనికి రాదు : పిల్లలు పెద్దవాళ్లకి గౌరవం ఇవ్వనప్పుడు గట్టిగా మాట్లాడొద్దు, అరవొద్దు ఇలాంటి పరిస్థితిలో అసహనం పనికిరాదని నిపుణులు చెబుతున్నారు. మీరు ఎన్నెన్ని చెప్పినా పిల్లలు వినరు. వారు మిమ్మల్ని చూసి మాత్రమే నేర్చుకుంటారు. కాబట్టి పిల్లలు పాటించాలనుకున్నవి ముందు మీరు అనుసరించమంటున్నారు నిపుణులు. నిదానంగా వారిలోనూ మార్పు వస్తుందని చెబుతున్నారు. ఒకసారి మీరు చెప్పిన మాటలు వినలేదా? అయితే వాళ్లనే తెలుసుకోనివ్వండని సూచిస్తున్నారు.

కోపం అదుపులో : పిల్లలు ఏదైనా పొరపాటు చేస్తే ముందు మీకు వచ్చేది కోపమే. అందుకే మొదట దండన దిశగా ఆలోచిస్తారు. అయితే ఈ సారి ఇలా కాకుండా ఈ విధంగా చేస్తే బాగుండేది అన్న చిన్న సలహా ఇవ్వండి. ఇంకెలా చేయొచ్చో పిల్లలను ఆలోచించమని చెప్పండి. దీంతో వారి ఆలోచనా తీరు మార్చుకుంటారు. మీరు గట్టిగా చెప్పండి కానీ గొంతు మాత్రం పెద్దగా చేయవద్దు. ఐ కాంటాక్ట్ ఇవ్వడమూ మర్చిపోవదంటున్నారు నిపుణులు.

ఛాయిస్ ఇవ్వండి : పిల్లలను ఇది చెయ్, అది చెయ్ అంటే వాళ్లకీ ఆజ్ఞలాగే ఉంటుంది. వారికి అది కష్టంగా అనిపిస్తుంది. బదులుగా వారికే ఛాయిస్ ఇవ్వంటున్నారు నిపుణులు. ఇవాళ రూమ్ సర్దుకుంటావా? దుస్తులు మడత పెట్టుకుంటావా? అని మీరు వాళ్లని అడగండి. అప్పుడు వారు నచ్చింది ఎంచుకుంటారు. దీంతో పనీ తొందరగా పూర్తవుతుంది. ఎంచుకునే అవకాశం వచ్చినందుకు పిల్లలు చాలా సంతోషిస్తారు.

Comments

Popular posts from this blog

You can create videos without Canva using several free and easy-to-use alternatives. Here’s how:

ai freee

లెర్న్ గుడ్ థింగ్స్