how to avoid Junk Food!

 

జంక్ ఫుడ్స్ మానలేకపోతున్నారా?- అయితే ఈ టిప్స్ ట్రై చేయండి! - HOW TO STOP EATING JUNK FOOD

జంక్ ఫుడ్ వల్ల కలిగే అనర్థాలు - ఇవి ట్రై చేస్తే బెటర్ అంటున్న నిపుణులు






Unhealthy_Food
Unhealthy_Food 
3 Min Read

Tips To Avoid Unhealthy Food : కొంతమందికి కడుపు నిండుగా ఉన్నా మళ్లీ ఏదైనా తినాలని మనసు లాగుతుంటుంది. మరి ముఖ్యంగా జంక్ ఫుడ్స్ చూస్తే ఆగలేకపోతుంటారు కొందరు. అయితే, ఈ అలవాటు దీర్ఘకాలం కొనసాగితే అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 














జంక్​ఫుడ్
జంక్​ఫుడ్ (Getty images)

తగినన్ని నీళ్లు : తగిన మోతాదులో నీళ్లు తీసుకోవడం వల్ల ఆహార కోరికలు నియంత్రణలో ఉంటాయని నిపుణులు అంటున్నారు. అదే విధంగా శరీరం తేమను కోల్పోకుండా కూడా జాగ్రత్తపడచ్చనని వివరిస్తున్నారు.

ఎక్కువ గ్యాప్ ఇవ్వద్దు! : బ్రేక్​ఫాస్ట్, లంచ్, డిన్నర్​ల మధ్య ఎక్కువ గ్యాప్ ఇవ్వద్దని నిపుణులు అంటున్నారు. తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు ఆహారం తినడం వల్ల చిరుతిండ్ల పైకి మనసు మళ్లకుండా జాగ్రత్తపడచ్చనని సలహా ఇస్తున్నారు. అలాగే మధ్యమధ్యలో పండ్లు, జీడిపప్పులు, బాదం, వాల్​నట్స్​ లాంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు.

జంక్​ఫుడ్
జంక్​ఫుడ్ (Getty image)

అందుకే ఇలాంటి ఆహారపు కోరికల్ని అదుపులో పెట్టుకోవాలని సలహా ఇస్తున్నారు. American heart association కూడా పలు లక్షణాలను పేర్కొంది. ఈ నేపథ్యంలోనే దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఊబకాయం తప్పదు! : సాధారణంగా గర్భం ధరించిన మహిళలకు ఏదో ఒకటి తినాలనే కోరికలు ఎక్కువగా కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే మూడ్ స్వింగ్స్, పని ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, పోషకాహార లోపం కూడా దీనికి కారణమవుతుంటాయని వివరిస్తున్నారు. ఇలాంటి సమయాల్లో జంక్​ఫుడ్స్ తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొవ్వులు, క్యాలరీలు పెరిగిపోతాయని అంటున్నారు. ఇవి దీర్ఘకాలంలో ఊబకాయానికి దారి తీస్తాయని పేర్కొన్నారు. పైగా గర్భిణులు జంక్ ఫుడ్​ను ఎక్కువగా తీసుకోవడం తల్లీబిడ్డలిద్దరికీ మంచిది కాదని తెలిపారు. కాబట్టి ఈ ఆహారపు కోరికల్ని అదుపులో ఉంచుకోవడం ఆరోగ్యానికి మంచిదని National Library of Medicine పేర్కొంది. ఇంకా మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుందని NIH పరిశోధనలో తెలింది.







బాగా నమిలి మింగండి! : ఇంకా తీసుకున్న ఆహారాన్ని బాగా నమిలి మింగడం వల్ల ఆహార కోరికలు తగ్గిపోతాయని పోషక ఆహార నిపుణులు చెబుతున్నారు.

భోజనం మానద్దు! : చాలా మంది వివిధ పనుల్లో పడి భోజనం చేయడం మర్చిపోతుంటారని నిపుణులు అంటున్నారు. ఇక ఆకలేసినప్పుడు అందుబాటులో ఉన్న పదార్థాలతో ఆకలిని తీర్చుకుంటారని వివరిస్తున్నారు. అయితే ఇది ఏ మాత్రం మంచి అలవాటు కాదని చెబుతున్నారు. సరైన సమయంలోనే ఆహారం తీసుకోవడం వల్ల జంక్​ఫుడ్స్​కి దూరంగా ఉండవచ్చనని సూచిస్తున్నారు.

జంక్​ఫుడ్
జంక్​ఫుడ్ (Getty image)

ప్రోటీన్లు : కార్బోహైడ్రేట్లతో పోల్చితే ప్రొటీన్లు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ప్రొటీన్లు పుష్కలంగా లభించే పాలు, పాల పదార్థాలు, నట్స్, కోడిగుడ్లు వంటివి తీసుకుంటే ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుందని వెల్లడించారు. దీంతో జంక్ ఫుడ్స్ పైకి మనసు మళ్లదని వివరిస్తున్నారు.

వీటితో పాటు కంటి నిండా నిద్ర, ధ్యానం, ఒత్తిడిని దూరం చేసుకోవడానికి యోగా, ఇతర వ్యాయామాలు చేయడం వల్ల కూడా చిరుతిండ్లు తినాలనే కోరికల్ని అదుపు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. ఫలితంగా జంక్​పుడ్స్ పైకి మనసు మళ్లకుండా ఉంటుందని అంటున్నారు.

జంక్​ఫుడ్
జంక్​ఫుడ్ (Getty images)

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

Comments

Popular posts from this blog

You can create videos without Canva using several free and easy-to-use alternatives. Here’s how:

ai freee

లెర్న్ గుడ్ థింగ్స్